26-10-2025 04:42:20 PM
పత్తి కింటాకు 10075 ధర నిర్ణయించాలి..
సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే 25 శనివారం రోజున మరిపెడ బంగ్లా శాఖ సమావేశం శాఖ కార్యదర్శి దొంతు సోమన్న అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మధు మాట్లాడుతూ రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించాలన్నారు. పత్తి దిగుమతులపై ఉన్న 11% శాతం సుంకం కొనసాగించాలన్నారు.
క్వింటాకు పదివేల 75 రూపాయలు బోనస్ 475 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు బాధ్యతనుండి తప్పుకోవటానికి ధరల వ్యత్యాశ పథకం రూపొందించింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న, తాటికొండ అనంత చారి, శాఖ కార్యదర్శి దొంతు సోమన్న, టౌన్ నాయకులు బాణాలు ఎల్లయ్య, దొంతు మమత, అల్వాల ఏకమ్మ, బాణాల రాజమ్మ, పాల్వాయి ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.