calender_icon.png 26 October, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడి సూపర్ గ్రేడ్ వన్ పోస్ట్ సాధించిన శ్రీలేఖ

26-10-2025 04:39:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ కు చెందిన పుట్ట శ్రీలేఖ కష్టపడి చదివి ఐసిడిఎస్లో గ్రేడ్ వన్ సూపర్వైజర్ గా ఉద్యోగాన్ని సాధించింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన శ్రీలేఖ పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి బాసర జోన్లో గ్రేడ్ వన్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గా ఎంపికయింది. రాష్ట్ర శిశు సంక్షేమ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న శ్రీలేఖ అదిలాబాద్ జిల్లా నార్నూరులో పోస్టింగ్లు కేటాయించారు. శ్రీలేఖ తండ్రి పుట్ట నాగేష్ రెవిన్యూ శాఖలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.