calender_icon.png 26 October, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కోదండ రామాలయంలో పూజలు చేస్తున్న దృశ్యం

26-10-2025 04:46:01 PM

వైభవంగా శ్రీ రామ యజ్ఞ మహోత్సవాలు ప్రారంభం..

నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్లలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీకమాసం సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామ యజ్ఞ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. దాతల సహకారంతో సమకూర్చిన ఉత్సవ విగ్రహాలు, దేవతామూర్తుల ఆభరణాలను, గొడుగు, రామదండం, నూతన యజ్ఞోపవీతం, తదితరాలు స్థానిక అయోధ్య రామాలయంలో ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మేళ తాళాలతో భక్తి కీర్తనలతో, జైశ్రీరామ్ నినాదాలతో శ్రీ కోదండ రామాలయానికి ఊరేగింపుగా వచ్చి ఉత్సవ విగ్రహాలకు, ఆభరణాలకు యజ్ఞోపవీతానికి, మకర తోరణం తదితరాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి సమర్పించారు.

అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది, అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు రాచకొండ నాగ మాధవరావు, రాచకొండ నరేష్, కొణతం చిన్న వెంకటరెడ్డి, పులిజాల వెంకటరమణ రావు, నా గండ్ల శ్రీధర్, చింతకుంట్ల పూర్ణ చంద్రారెడ్డి, రాగిరెడ్డి గోపాల్ రెడ్డి,ఉప్పల కృపాకర్, గొల్ల సుధాకర్, యడవల్లి వెంకటరెడ్డి, జట్టి వెంకన్న, కొనతం చిన్న లచ్చిరెడ్డి, తాటికొండ వెంకటరెడ్డి, పొనుగోటి జంగారావు, నిమ్మగడ్డ సుబ్బారావు, గుండా సత్యనారాయణ, రాచకొండ విజయ్, కొప్పు లక్ష్మీనారాయణ, సుధాకర్ రెడ్డి, కట్ట గణేష్ రెడ్డి, కొనతం నాగిరెడ్డి, సంకల మద్ధిసత్యనారాయణ రెడ్డి, తాళ్ల నరేందర్ రెడ్డి, చెరుకుపల్లి కిషోర్, ఆరే కృష్ణారెడ్డి, కొణతం రాంరెడ్డి, కొనతం నారాయణరెడ్డి, కందిబండ శ్రీనివాసరావు, తాటికొండ శ్రీరామ్ రెడ్డి, తాటికొండ సత్యనారాయణ రెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు, మర్రు శ్రీనివాసరావు, కాలం సైదులు, పోలగాని భరత్, సైదాచారి, కాంపల్లి నర్సిరెడ్డి, కాంపల్లి నారాయణరెడ్డి, కట్ట జార్జి రెడ్డి, కుంకు మోహన్ రావు, శంకర్ రెడ్డి, ఈగ చిన్న శ్రీనివాసరావు, కొణతం విజయలక్ష్మి, రాచకొండ శ్రీలక్ష్మి, పొనుగోటి శోభ, అనిత, తడకమళ్ళ అరుణ, పార్వతి, వనజా రెడ్డి, చింతకుంట్ల లక్ష్మి, తాటికొండ పుల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.