15 May, 2026 | 8:27 AM

బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందంతో ఓటమి

21-06-2024 12:20 AM

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

నిజామాబాద్, జూన్20(విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందంతోనే కాంగ్రెస్ ఓటమి పాలయిందని కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ఓటమిపై నిజామాబాద్‌లో నిర్వహించిన సమీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.300 పంపిణీ చేశారని ఆరోపించారు. ఓటమి చెందినా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాన హామీ చక్కెర ఫ్యాక్టరీల పునఃప్రారంభానికి కృషి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటిగా గుర్తించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని                పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాను, కాంగ్రెస్ కార్యకర్తలందరు శిరసావహిస్తారని స్పష్టంచేశారు.