18 July, 2026 | 2:03 AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

18-07-2026 02:03 AM

మున్సిపల్ చైర్మన్ బాలకోటి 

భూత్పూర్, జులై 17: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి పిలుపునిచ్చారు. పట్టణంలోని 9వ వార్డులో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తొమ్మిదవ వార్డులో ఉన్న సమస్యలను తిరిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు, ఇంటి యజమానులు చుట్టూ పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇళ్లలో ఉండే చెత్తను మురికి కాలు వలలో వేస్తున్నారని, అలా వేయకుండా తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డ్రై పాటించి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటే ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  నవీన్ గౌడ్,  కౌన్సిలర్లు పాల్గొన్నారు.