16 August, 2026 | 2:29 AM

సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు

16-08-2026 12:00 AM

హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ పూర్తయింది. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశను వేగంగా పూర్తి చేసుకుంటోంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.   

ఈ మేరకు టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో సాయిదుర్గతేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఒక దిగ్గజ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రానికి వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, బీ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, చేతన్, పృథ్వీ పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా నవీన్ విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు.