calender_icon.png 2 February, 2026 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేనోడికి చలానా.. ఉన్నోడికి సలామా?

01-02-2026 11:54:11 PM

  1. కేబీఆర్ పార్క్ చుట్టూ ధనవంతుల దర్జా
  2. ట్రాఫిక్ రూల్స్ తూచ్.. అడ్డగోలుగా వాహనాల పార్కింగ్
  3. బస్టాండ్లు, నో పార్కింగ్ జోన్లు ఆక్రమించి అదే తీరు
  4. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు 
  5. చట్టం ఉన్నోళ్ల కొమ్ము కాస్తోందంటూ విమర్శలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): చట్టం అందరికీ ఒకటేనా లేక పేదవాడికి ఒక న్యాయం.. పెత్తందారుకు మరో న్యాయమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమమవుతున్నాయి.  నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కనిపిస్తున్న దశ్యాలు చూస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు కేవలం సామాన్యుల జేబులు ఖాళీ చేయడానికే ఉన్నారా అనే అనుమానం కలగు లోంది. ఆ రోడ్డు ఎవరి సొత్తు అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

కేబీఆర్ పార్క్ చు ట్టూ ఉన్న రోడ్డు ప్రజలందరిది. కానీ, అక్క డ జరుగుతున్నది మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సంపన్నుల ఇష్టారాజ్యం. వాకింగ్ కోసం వచ్చే వారు తమ ఖరీదైన లగ్జరీ కార్లను రోడ్లకు అడ్డంగా, నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డు ఆక్రమణ.. బస్సులు ఆగేదెక్కడ?

ఉదయం, సాయంత్రం వేళల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వాకింగ్ కోసం వచ్చే వారి కార్లు రోడ్డులో ఏకంగా మూడో వంతు భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. నో పార్కింగ్ బోర్డులకు విలువేది.. నో పార్కింగ్ అని బోర్డు ఉన్న చోటే దర్జాగా కార్లు పెడుతున్నారు. బస్సు ఆగాల్సిన బస్టాండ్లలో, బస్ బేలలో కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆపాల్సి వస్తోంది.

ఇది ట్రాఫిక్ జామ్ కు, ప్రమాదాలకు దారి తీస్తోంది. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే రోడ్డు మధ్యలోకి రావాల్సిన దుస్థితి. ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాల్సిన చోట కార్లు అడ్డంగా ఉండటంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం జాగింగ్ సమయంలో ఆ ప్రాం తంలో ట్రాఫిక్ రూల్స్ వర్తించవా అన్న సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు.

పార్కింగ్ స్థలం లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి తప్ప.. ఇలా రోడ్లను, బస్టాండ్లను ఆక్రమించడం ఎంతవరకు సమంజసం. సామాన్యుడిపై ప్రతాపం చూపించే ట్రాఫిక్ విభాగం.. బడా బాబుల కార్ల వైపు చూసే దమ్ముందా.. అని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. 

కిరాణా కొట్టు దగ్గర ఫొటోలు.. ఇక్కడ సెల్ఫీలా..?

పోలీసుల ద్వంద్వ వైఖరిని నగరవాసులు తీవ్రంగా ఎండగడుతు న్నా రు. ఒక సామాన్యుడు బైక్ మీద వెళ్లి, కిరాణా షాపు ముందు బండి ఆపి, లోపలికి వెళ్లి సరుకులు తెచ్చుకునే ఆ రెండు నిమిషాల వ్యవధి లోనే.. ట్రాఫిక్ పోలీసులు వెనుక నుంచి ఫొటో తీసి చలాన్ వేస్తున్నా రు. లేదా క్రేన్ వచ్చి బండిని లాక్కెళ్లిపోతుంది.

మరి కేబీఆర్ పార్క్ చుట్టూ గంటల తరబడి వందల సం ఖ్యలో కార్లు రోడ్డును ఆక్రమించి పార్క్ చేసి ఉంటే ఎందుకు చలాన్లు పడవు.. అని ప్రజలు నిలదీస్తున్నా రు. సామాన్యుడు నిబంధన అతిక్రమిస్తే చలానా.. సంపన్నుడు అతిక్ర మిస్తే సలామా.. ఇదేం న్యాయం.. వారి కార్ల నంబర్ ప్లేట్లు కెమెరాలకు కనిపించవా.. లేక చూసి కూడా చూడనట్లు వదిలేస్తున్నారా?