calender_icon.png 2 February, 2026 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ నోటీసుపై భగ్గుమన్న గులాబీ దండు

02-02-2026 12:00:00 AM

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు

సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం

సంగారెడ్డి/ మెదక్/ సిద్దిపేట, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): ఫోన్ టాపింగ్ విచారణలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆ ర్ ను విచారించడం అత్యంత దుర్మార్గమని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్య క్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చే పట్టారు. ఆయా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, పటాన్చెరు ని యోజకవర్గ ఇంచార్జి ఆదర్శరెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు భూపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్ ఆ ధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ను నిందించడం సిగ్గుచేటని జిల్లా పార్టీ అధ్యక్షులు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో నిరసన చేపట్టి సిద్దిపేట వరకు బైక్ ర్యాలీగా వచ్చిన జిల్లా అధ్యక్షుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కేసీఆర్ విచారణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు.

సిద్దిపేట రూరల్ మండలం లక్ష్మీదేవి పల్లి, నారాయణరావుపేట మండ లం జక్కాపూర్, చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్, జగదేవపూర్, గజ్వేల్, నంగునూరు, హుస్నాబాద్, మండలాలలో బిఆ ర్‌ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం హైదరాబాదులోని నందిని నగర్ కు ర్యాలీగా వెళ్లారు. గజ్వేల్ నియోజకవర్గం లోని పార్టీ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడినుండి కేసీఆర్ వెంట హైదరాబాద్ నందిని నగర్ కు చేరుకున్నారు.

మెదక్ జిల్లాలో...

రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభు త్వం కేసులు పెడుతూ ఆరాచక పాలన సాగిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మె ల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ సర్కార్ అక్రమంగా పెడుతున్న కేసులను నిరసిస్తూ ఆదివారం మెదక్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్‌ఎస్ శ్రేణులతో కలసి నల్ల జెండాలు కండువాలు ధరించి బైక్ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని అన్నారు. మెదక్ లో బీఆర్‌ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టామని తెలిపారు. ఫోన్ ట్యా పింగ్ అంశంపై నిష్పక్షపా తంగా, పారదర్శకంగా విచారణ జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా సిట్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి, మాయ మల్లేశం, భీమరి కిషోర్, నాయకులు జీవన్ రావు, సురేందర్ గౌడ్, జుబెర్ అహ్మద్, తుమ్మ లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, సంతోష్, నరేష్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ వార్డుల నాయకులు, కార్యక ర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.