calender_icon.png 2 February, 2026 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరశైవ లింగాయత్ సమాజ జిల్లా అధ్యక్షుడిగా మహాదేవుని శ్రీనివాస్

02-02-2026 12:00:00 AM

సిద్దిపేట, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ సమాజ జిల్లా అధ్యక్షుడిగా మహాదేవుని శ్రీనివాస్ (కొమురవెల్లి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రం సిద్దిపే టలోని వీరశైవ లింగాయత్ సమాజ భవనంలో జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో ఆయ న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆకుల ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో ని అన్ని వర్గాలను కలుపుకొని సమాజ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

జిల్లాలో రుద్ర భూమి, బసవ భవనం ఏర్పాటు కోసం కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉం చిన జిల్లాలోని వీరశైవులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు నరుకుల శివప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహిం చారు. జిల్లా, పట్టణ కమిటీ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.