calender_icon.png 25 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫర్నిచర్ షాప్‌లో అగ్గి ఐదుగురి గల్లంతు

25-01-2026 01:17:50 AM

నాంపల్లిలో నాలుగు అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టిన మంటలు

  1. లోపలే చిక్కుకుపోయిన వాచ్‌మెన్ కుటుంబం 
  2. దట్టమైన పొగలతో సహాయక చర్యలకు ఆటంకం 
  3. రంగంలోకి రోబో ఫైర్ మిషన్  
  4. జేసీబీలతో గోడలు పగులగొట్టి లోపలికి వెళ్లే యత్నం 
  5. అర్ధరాత్రి వరకు అదుపులోకి రాని మంటలు

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నాంపల్లి గల ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్, హెచ్ ఫర్నిచర్ గోదాము లో మంటలు చెలరేగి క్షణాల్లోనే  నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ప్రమాదం మొదట గ్రౌండ్ ఫ్లోర్లో సంభవించి, ఆపై నాలుగు అంతస్తులకు విస్తరించింది. భవ నం లోపల వాచ్‌మెన్ కుటుంబంలోని ఇ ద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు.

భవనాన్ని మంటలు, దట్టమైన పొగలు కమ్మేయడం తో ఆ ప్రాంతమంతా భీతావహంగా మా రింది. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవ డం, భవనం లోపల చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంటల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు లోపల.. గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదన

భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుటుంబం మంటల్లో చిక్కుకోవడం అందరినీ కలచివేస్తోంది. ప్రమాద సమయంలో లోపల వాచ్‌మెన్ భార్య, కుమా రులు అఖిల్ (7), ప్రణీత్ (11) సహా మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. మంటల ధాటికి, పొగ తీవ్రతకు బయటకు రాలేక వారు లోపలే చిక్కుకుపోయారు. తమ పి ల్లల ఆచూకీ కోసం బయట తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. వారి పరిస్థితి ఏంటన్నది తెలియక క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది.

సాధారణ ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి రాకపోవడం, దట్టమైన పొగ కార ణంగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో అధికారులు అత్యాధునిక రోబో ఫైర్ మిషన్ ను రంగంలోకి దించారు. రోబో సాయంతో మంట లను అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. మరోవైపు భవనం లోపలికి వెళ్లే దారి లేకపోవ డంతో, జేసీబీల సాయంతో గోడలను పగులగొట్టి వెంటిలేషన్ కల్పించే ప్రయత్నం చేశారు. కేంద్ర విపత్తు నిర్వహణ దళం బృందాలు, హైడ్రా సిబ్బంది ఆక్సిజన్ మా స్కులతో లోపలికి వెళ్లేందుకు సాహసోపేతమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అర్ధ రాత్రి దాటిన మంటలు అదుపులోకి రాలే దు. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేర కు కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా జనసాంధ్రత మధ్య గో డౌన్ల నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఇది ప్రమాదమా లేక అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యమా అని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఘటనా స్థలిని సందర్శించిన  సీపీ, కలెక్టర్ 

ప్రమాద విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, జిల్లా కలెక్టర్ హరిచందన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. సెల్లార్ నిండా ఫర్నిచర్ ఉం డటం, దారి ఇరుకైనదిగా ఉండటంతో రె స్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అని వెల్లడించారు. నాంపల్లి మెయిన్ రోడ్డుపైనే ప్రమాదం జరగడంతో అబిడ్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి సహాయక చర్యలకు ఆటంకం లేకుండా చేశారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే?

నాలుగు అంతస్తుల ఈ కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్ల లో భారీగా ఫర్నిచర్‌ను నిల్వ చేశా రు. తొలుత సెల్లార్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అం టుకున్నాయని, అక్కడ మండే స్వ భావం ఉన్న ఫోమ్, చెక్క సామగ్రి, రసాయనాలు ఉండటంతో క్షణాల్లో నే మంటలు ఎగిసి పైఅంతస్తులకు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు, ఫైర్ సి బ్బంది ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. దట్ట మైన నల్లటి పొగ ఆ ప్రాంతం మొ త్తాన్ని కమ్మేయడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.