calender_icon.png 25 January, 2026 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ మేడారం రూపకర్త.. సీతక్క

25-01-2026 12:13:12 AM

* త్యాగాల కుంభమేళా, ఆసియాలో అతిపెద్దదిగా పేరొందిన ఆదివాసుల అమరుల జాతర మేడారం ప్రాంగణం కొత్త రూపు  సంతరించుకున్నది. అఖండ భారతంలో 18 దిక్కులు, 101 రాజ్యాలు ఏర్పాటు చేసిన ఈ దేశ మూలవాసులు ఆదివాసుల చరిత్ర సంస్కృతి జీవ రాతి పుష్పాల రూపంలో కొలువైంది. అదే నేడు వెన్నెల పూల ఉద్యాన వనంగా మారింది. దీనికి రూపకర్తగా, చోదక శక్తిగా నవనవన్మేషంగా వెన్నెల కెరటంగా సీతక్క చేసిన కృషి చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన అధ్యాయంగా మారుతున్నది. సమ్మక్క సారలమ్మలను  తన కనుపాపలుగా, అనివార్యమైన మరణాన్ని జయించడం నేర్పిన వారుగా, జనం కోసం జీవించండి అని తనను నడిపిస్తున్న వారుగా ఆవాహన చేసుకున్న వారు సీతక్క.

అనసూయ సీతక్క తన బాల్య విద్యార్థి దశ నుంచే ఒక చేతితో విప్లవోద్యమాన్ని, మరో చేతితో తన అస్తిత్వ నేపథ్య చరిత్ర అధ్యయనం, సాహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తన విప్లవ జీవన సహచరుడు, ఆదివాసీ సేనాని అమరుడు కుంజా రాము సహచర్యంలో నిత్యం ప్రజల మధ్య ప్రజల నుంచి ప్రజల దగ్గరకు అనే విధానంలో ఆచరణతో ఎప్పటికప్పుడు పరిణితి సాధిస్తూ ఉండేది. కవయిత్రిగా, గాయ నిగా, దాడుల ప్రతిదాడులు ఎత్తుగడల వ్యూహకర్తగా పలు రూపాల్లో విప్లవోద్యమ విస్తరణకు తన వంతు చురుకైన పాత్ర పోషించింది. 

వనంలోనే పరిశోధన

విప్లవోద్యమములో ఉన్నప్పుడే మేడారం సమ్మక్క చరిత్రపై మరింత పరిశోధన చేశా రు. నాగరికతకు నడక నేర్పిన ఆదివాసీ సైన్స్ కు ప్రాచుర్యం కల్పించింది. ప్రజల్లో మౌఖికంగా వారసత్వంగా వస్తున్న జానపద గాధ లు, పాటలు, సమ్మక్క బంధుగణంలో వివిధ వంశీయుల నుంచి సమాచారం సేకరించారు. సీతక్క అమ్మ పేరు సమ్మక్క, నాన పేరు సమ్మయ్య .కోయలలో 3 నుంచి 7 గ ట్లు ఉంటాయి. 5వ గట్టు సమ్మక్క వంశంలో పుట్టిన బిడ్డగా, వెదురు, మారేడు దేవత పూజిత వృక్షాలుగా భావించే తన అస్తిత్వ మూలాలను తెలుసుకున్నారు.

ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు వివరాలు సేకరించారు. ఇతను కోయలలో 4 వ గొట్టుకు చెందిన చెందిన వారు, మద్ది బూరుగ మొక్కలను ఆరాధిస్తారు. అలాగే మూడవ గొట్టు సారలమ్మ వారు ఇప్ప కస్సు చెట్లను, ఆరో గొట్టు వారు బండారి వేప చెట్లను ,సిద్ధబోయిన వంశం వారు నెమలి నార, మర్రి చెట్లను ఆరాధిస్తారు. ప్రజల రక్షణకు ప్రతీకగా,ప్రార్థిస్తే అన్యాయం తొలగి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్న పగిడిద్ద రాజు గద్దెను మేడారంలో సమ్మక్క గద్దె సమీపంలో దళ కమాండర్‌లుగా ఉన్న విప్లవ జంట సీత రాము ప్రతిష్ట చేయించారు.

అవకాశాన్ని ఉపయోగించుకుంటూ..

సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వచ్చిన అవకాశాన్ని అద్వితీయంగా ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసుల చరిత్రను, వారి జీవన విధానాన్ని, వారి సౌందర్య, కళాత్మక దృష్టి కోసం పడిన తపనను ఎల్లకాలం మనలని ఉత్తేజితం చేసే, మన హృదయాలను వెలిగించే విధంగా ఒక శిల్పా నిర్మాణ యాగాన్ని ఆరంభించారు. తన అస్తి త్వ మూలాలు, తనను అన్ని వేళలలో ఆత్మ గౌరవంతో, ధిక్కార కేతనంతో ,ప్రజల కడగం డ్లను తీర్చడం కోసం నిత్యం తనను ఆవ హించి నడిపించే ఆరాధ్య అరణ్య ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మల చరిత్ర విస్తృ త అధ్యయనం కోసం, సంస్కృతి, హక్కుల రక్షణ కోసం మారోజు వీరన్న రాము సీతక్కలు తుడుము దెబ్బ సంస్థను ఏర్పాటు చేశారు.

మైపతి అరుణ్ బృందం నేతృత్వంలోని పరిశోధన బృందం మధ్య భారత ఆది వాసీ సంస్కృతిని అధ్యయనం చేసి మరింత ప్రామాణికమైన సమాచారం సేకరించింది. ప్రముఖ స్థపతి ఈమని నాగిరెడ్డి నేతృత్వంలో 450 మంది శిల్పులు కృషితో ప్రా ణ ప్రతిష్ట జరిగింది. ప్రపంచంలోనే ఆదివాసీలు, సంపద సృష్టికర్తలు,ఉత్పాదక శ్రామిక వర్గాలు అత్యధికంగా దర్శించుకునే మహా జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం అభివృ ద్ధి గత ప్రభుత్వాల కాలంలో అరకొరగానే కొనసాగింది.

భారీ స్థాయిలో శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టలేదు.ఇప్పుడు చరిత్ర తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. భవిష్యత్ లో ఏ ఇతర మతాలు ఈ జన జాతరను హైజాక్ చేయకుండా, వారి చిహ్నాలు ఇక్కడ కనపడ కుండా, ఆదివాసీ చరిత్రను శాశ్వతత్వాన్ని సంతరింపచేసింది.

మేడారం వికాసంలో విశేష కృషి

తెలంగాణ చరిత్ర పురోగమనంలో తనదైన ముద్ర ఉండేలా తపనతో ఉన్న రేవంత్ రెడ్డితో ఆత్మీయ సోదర అనుబంధంతో, తన ఆదివాసీ అస్తిత్వ కేంద్రం మేడారం వికాసంపై తన ఆకాంక్షలను రూపు దాల్చి సాకా రం చెయ్యడంలో కృషి సీతక్క కృషి చేసింది. మేడారం జాతర అభివృద్ధి కోసం గతంలో ఎవ్వరూ చేయని,సాహసించని గొప్ప ముం దడుగు వేసేలా, రేవంత్ రెడ్డి సారథ్యంలో విన్నూత్న అధ్యాయాన్ని ఆరంభించింది సీతక్క. 250 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో మేధో సృజనాత్మక పాత్ర పోషించింది.

మేడారాన్ని చూస్తే ఆదివాసీల చరిత్ర జ్ఞప్తికి వచ్చేలా నిర్మాణాలు ఏర్పాటు చేసింది. దేవస్థానం ఆధునీకరణ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ,సాండ్ స్టోన్ రాయి పై 7000 ఆదివాసీ సాంప్రదాయాల బొమ్మలు ,8 అర్చ్ గేట్లపై ఆదివాసీ దేవతల గొట్టు గోత్రా ల వం శాల, పూజా వృక్షాల చిత్రాలను ఏర్పాటు చేసింది.వందలాది శిల్పులు రాత్రి పగలు శ్రమించి అద్వితీయమైన మానవ శా వికాస సౌధాల ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి చరిత్ర నిర్మాణంలో ఒక గొప్ప ముందడుగుని లిఖితం చేసింది. 

ప్రకృతికి గాయం చేయకుండా..

ప్రకృతికి గాయం చేయకుండా మానవ నాగరికతని నిర్మించిన ఆదివాసీ జ్ఞాన నైపుణ్యాలను తెలిపే చిత్రలిపిలను శిల్పాలుగా మలచింప చేసింది. ఈ కట్టడాలపై సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, కో యల ఇష్ట దైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, బండి చక్రాలు, అడ్డ నిలువు గీతలు స్తంభాలపై చెక్కారు.

స్వాగత తోరణంలో సమ్మక్క వంశ చరిత్ర, పూజించే దుప్పి అడవి దున్న, నెమలి ఈకలు, గొట్టు గోత్రాలకు ప్రతి రూపమైన సూర్య చంద్రు లు, నెల వంకలను చిత్రించారు. మరో ప్రధాన ద్వారంలో సారక్క ,సిద్ధబోయిన, కొక్కెర వంశ చరిత్రకు ప్రతీకగా మలిచారు. మేడా రం నుంచి 600 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాయచూర్ నుండి నాలుగు వేల టన్నుల భారీ నాణ్యమైన శిలలను ఈ నిర్మాణ పనులలో ఉపయోగించారు.

జాతర పరిఢవిల్లేలా..

 18 జనవరి 2026 మేడారం గొప్ప సన్నివేశానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర క్యాబినెట్, పరిపాలన యంత్రాంగం తల్లుల చెంతకు చేరింది. అది దేవతల, అది అక్షరాల, అది ధ్వనుల, అది చిత్రాల, అలనాటి అపురూప జానపద కళాకృతుల, అందాల బొమ్మల ఆనవాళ్లను ఒక చోట చేర్చి, దక్కన్ పీఠభూమి పలవరింతకు, మధ్య భారత పులకరింతకు, మూలవాసుల మురిపెంకు, తెలంగాణ ఆదివాసీల ఆత్మగీతంకు మేడారంను రాజధా నిగా మలచిన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.

మానవ వికాస జ్ఞాన కేంద్రంగా మారింది. మహా జాతర నిర్వహణకు మేడా రం సర్వ సన్నద్ధమైంది. పచ్చని అడవిలో జరిగే పవిత్ర జాతర పది కాలాల పాటు పరిడమల్లేలా సంకల్పించి శిల్ప నిర్మాణ యాగంతో మేడా రానికి కొత్త రూపు సాకా రం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, చోదక శక్తి సీతక్కకు అభినందనలు.

ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా..

మనువాద సంస్కృతి ప్రజల్లో ఎక్కువగా ఆమోదం, ప్రాచుర్యం పొం దిన వారిని ఏదో పురాణాలు, కల్పితాలు సృష్టించి తమ దేవతలుగా మా ర్చుకుంటాయి. బుద్ధుడిని దశావతారం గా ఒకడిని చేశాయి. షిర్డీ సాయిని కూడా తమవారిగా ప్రకటించుకున్నా యి. కొన్ని సమయాలలో తమ ఆర్య దేవతల కంటే ఎక్కువగా ప్రజలు వారిని ఆరాధించడం ఎక్కువైనప్పుడు మళ్లీ కట్టు కథలు సృష్టించి తమ దేవతల పరిధిలోకి రారని ప్రచారం చేస్తా యి.

ఇదే ప్రక్రియను సంఫ్‌ు పరివార్ శక్తులు ఆదివాసీ బహుజన ప్రజల ఆరాధ్య అమర తల్లులు సమ్మక్క సారక్క పట్ల అనుసరించే ప్రయత్నం చేశాయి. పూజా సంస్కారాలలో బ్రహ్మణీయతను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసా రు. బ్రాహ్మణ పూ జారులను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసారు. అసలు చరిత్ర ను వక్రీకరించి అదివాసులకు మతము రంగును అద్దె ప్రయ త్నం చేసారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టారు.

అచ్చమైన ఆదివాసీ సాంస్కృతిక విధానాలతో మేడారం జాతర నిర్వహించ బడడానికి వారి విధానాల పరిర క్షణకు ప్రధాన కృషి చేసిన ఘనత నక్సలైట్ పార్టీలకు చెందుతుంది. ఈ ప్రాం త ఉద్యమ దళ కమాండర్లుగా పని చేసిన సీతక్కరాము జంట ముందు వరుసలో ఉండి పనిచేసింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన ఒక చారిత్రక వాస్తవం. 

 అస్నాల శ్రీనివాస్,

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం,

9652275560