25-01-2026 01:23:34 AM
సింగరేణిపై రాబందులను, గద్దలను, పెద్దలను వాలనివ్వ..
ఎవరికో లేఖ రాయడమెందుకు.. హరీశ్ నాకు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై విచారణకు సిద్ధం
* ఒకాయన కట్టుకథలు రాయడం, వెంటనే ఒకాయన లేఖ రాయడం.. మరొకాయన విచారణ జరిపించడమేమిటి? టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రజలకు వేరే సంకేతాలు పోవద్దనే ఉద్దేశంతోనే టెండర్‌ను రద్దు చేశా..సింగరేణి ఉద్యోగుల ఆత్మస్థుర్యైం దెబ్బతీసేలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కట్టు కథనాలు రాయడం సరైంది కాదు. ‘కొత్తపలుకు’ల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయోగాని, సింగరేణి సంస్థపై నిందలు మోపుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు గనుల వ్యవహా రంపై సీబీఐ విచారణ జరగాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే త ప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సిం గరేణిపై రాబందులను, గద్దలను, పెద్దలను వాలనివ్వనని ఆయన తెలిపారు. కాంట్రా క్టు ఇచ్చేటప్పుడు సైట్ విజిట్ అనేది తా ము పెట్టిన కొత్త నిబంధనేమీ కాదని, కేం ద్ర ప్రభుత్వరంగ సంస్థలైన కోలిండియా, ఎన్‌ఎండీసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వం కంపెనీలలో ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉందని వెల్లడించారు.
నైనీ కోల్‌బ్లాక్‌లకు బీఆర్‌ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారని, సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే అందులో 20 టెండర్లు బీఆర్‌ఎస్ హ యాంలోనివే అన్నారు. ఎవరికో లేఖ రా యడమెందుకు. మాజీ మంత్రి హరీశ్‌రా వు తనకు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టుల పైన విచారణకు తాను సిద్ధమ ని, విదేశాల నుంచి సీఎం రాగానే తాను స్వయంగా ఆయనను ఒప్పించి విచార ణకు ఆదేశాలు ఇప్పిస్తానని తెలిపారు. శోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సృజన్‌రెడ్డి కంపెనీకి సీఎంకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
నాడు కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని కాంట్రాక్టులు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి సంస్థ లో ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటున్న ఐదుగురు బీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారే అ న్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రభుత్వంపై, ప్రభుత్వ ఆస్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎవరి కళ్లలో ఆనందం చూసేందుకు తనపై రాధాకృష్ణ ఆవాస్తవ కథనం రాసోరో తెలిదుకానీ.. అది అవాస్తవమని ఒప్పుకోలేదంటే, తన వ్యక్తిత్వ హననంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. శనివారం ప్రజాభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.
వివిధ కంపెనీల్లోనూ సైట్ విజిట్ నిబంధనలు...
సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉన్నదని ఆయన వివరించారు. 2018, 2021, 2023లో కోలిండి యా అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్) రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్‌లో ఉన్నదన్నారు. 2018, 2021లో తాము అధికా రంలో ఉన్నామా? అని ఆయన ప్రశ్నించారు.
దీంతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎండీసీ, ఐఐటీ జమ్ము, ఐఐఎంబీ బెంగళూరు, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్‌ఎల్‌సీ, సైనిక్ స్కూల్ (ఉత్తరఖాండ్), సైనిక్ స్కూల్ కాలికిరి, దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీ గుజరాత్, హెచ్‌పీసీఎల్ ఎస్‌పీఎంసీఐఎల్, , మహాత్మాపూలే రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లిమిటెడ్ ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ర్టంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా సైట్ విజిట్ నిబంధన ఉన్న ట్లు వివరించారు.
కోలిండియాకు అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ వారు సింగరేణి సంస్థకు సూచించిన టెండర్ నిబంధనలలో సైట్ విజిట్ జరపడం తప్పనిసరి అని పేర్కొన్నదని, సీఎంపీడీఐఎల్ నిబంధన మేరకే సింగరేణి సంస్థ 2018 నుంచి ఈ నిబంధనను పాటిస్తూ వస్తున్నదన్నారు. ఈ నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వా త కొత్తగా పొందుపరిచారు అన్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా కంపెనీల్లో నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదు అని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి..
సింగరేణి సంస్థ టెండర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి బావ మరిదికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని, వారు పేర్కొన్నట్లుగా సృజన్‌రెడ్డి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎండీ దీప్తిరెడ్డి. ఆమె కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కుమార్తె అని, ఆమె భర్త.. ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ వ్యవహారంలో సీఎంకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా బీఆర్‌ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులు అని వివరించారు.
హరీశ్‌రావుకు కానీ ఇంకా ఎవరికైనా కానీ అనుమా నాలు ఉన్నట్లయితే తాను వివరించేవాడిని అని, దీనిపై సిట్ విచారణ కావాలని తనకు లేఖ రాస్తే జరిపిస్తానని పేర్కొన్నారు. కేవలం నైనీ బ్లాక్ టెండర్‌పైనే కాకుండా 2014 నుండి నైనీ బ్లాక్, తాడిచర్ల సహా ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పేర్కొన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
తాను అడ్డొస్తున్నాననే తప్పుడు ప్రచారాలు..
తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి కనీస అవగాహన లేదని, సింగరేణి, తెలంగాణ ఆస్తులపై గద్దలు, రాబందులు రాకుండా తాను కట్టడి చేస్తున్నానని, తనతో వారికి ఇబ్బంది ఉంది కాబట్టే తనపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుందని హెచ్చరించారు.రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై వస్తున్న కొన్ని కట్టుకథలు, రాతలు అంతిమంగా 42 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థుర్యైన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట నాడు పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, కండ, స్వేదముతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, బొగ్గు సంపద పైన ఎటువంటి రాబందులు, గద్దలు, పెద్దలను వాల కుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. సిం గరేణి బొగ్గు ఉత్పత్తిని, నాణ్యతను మరింత పెంచుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని భట్టి విక్రమార్క తెలిపారు.
గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు ఉన్న గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేష న్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
2018లోనే కోల్ ఇండియా డాక్యుమెంట్ పంపింది..
ఈ బొగ్గు గనుల టెండర్ల విషయంలో నిజానిజాలు బయటకు రా వాలని, వాస్తవాలు ప్రజలకు తెలియా ల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఇష్టానుసారంగా ఎవరుపడితే వారు మాట్లాడుతున్నారని, సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుందన్నారు. అందరికీ వాస్తవాలు తెలియాల్సి ఉందని ఆయన ఆయన తెలిపారు.
నైనీ బ్లాక్ కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆమేరకు ఆ గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టులో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ, తానేదో కొత్తగా నిబంధనను తీసుకొచ్చింది కాదని, 2018లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారుచేసి పంపించిందన్నారు. హరీశ్ రావు దీనిపై లేఖ రాయడం మంచిదే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారణ చేయిండం మంచిదేనన్నారు. వారి నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని కేవలం కొందరు భట్టి విక్రమార్కకు చెందిన వారికి మాత్రమే కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు. ఒకాయన కట్టుకథలు రాయడం, వెంటనే ఒకాయన లేఖ రాయడం, మరోకాయన విచారణ జరిపించడమేంట న్నా రు. టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రజలకు వేరే సంకేతాలు పోవద్దనే ఉద్దేశం తో టెండర్‌ను రద్దు చేశామని అన్నారు.
డీజిల్ సరఫరా విధానంలో..
సింగరేణిలో డీజిల్ సరఫరా ను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వా రా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్ రావు ఆరోపణలను భట్టి విక్రమార్క ఖండించారు. డీజి ల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్‌స్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజీల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించా రు.
సింగరేణికి సంబంధించిన టెం డర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు...తన వద్దకు గానీ రాష్ట్ర ప్రభు త్వం వద్దకు రావని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అం దించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అది 105 ఏళ్ల నుంచి స్వయంప్రతిపత్తిలో పనిచేస్తోందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని అని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబం ధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారం చేయొద్దు..
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను అధిపతినని ఏది రాసినా చెల్లుతుందని అనుకుంటే సరైందికాదని ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణకు ఉద్దేశించి అన్నారు. ‘రాధాకృష్ణ.. నువ్వు రాసింది అవాస్తవమని ఒప్పుకో...లేదంటే ఇది వ్యక్తిత్వ హననంగా పరిగణించాల్సి వస్తుంది. రాధాకష్ణ ఎవరి కళ్లల్లో సంతోషం కోసం, ఎవరిని ఆనంద పరచడం కోసం రాశాడో ఆయనకే తెలియాలి.
పెట్టుబడులు, కట్టు కథల విషపు రాతల రాధాకృష్ణ తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి, వాస్తవ దూరమైనవి. కనుక రాధాకృష్ణ తాను రాసినవన్నీ అవాస్తవాలు అని స్వయంగా తిరిగి రాయాలి. లేనట్లయితే ఆయన రాతలు వ్యక్తిత్వ హననం జరిగినదిగా భావించాల్సి ఉంటుంది’ అని భట్టి పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముం దుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టులో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ తానేదో కొత్త నిబంధన పెట్టినట్లు రాధాకృష్ణ్ణ పేర్కొన్నారని, ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారం టూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు.
ప్రభుత్వం, సింగరేణి మెనేజ్‌మెంట్, కార్మికులు పూర్తి నిబద్ధతతో సంస్థ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగుల ఆత్మస్తుర్యైన్ని దెబ్బతీసేలా కట్టు కథనాలు రాయడం సరైంది కాదన్నారు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? కొత్తపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయోగాని, సింగరేణి సంస్థపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.
తాను 40 ఏళ్లుగా పోగుజేసుకున్న వ్యక్తిగత జీవితంపై ఇష్టానుసారంగా రాస్తే ఒప్పుకోనని, ఉన్నత విలువలతో తాను పనిచేస్తున్నాననీ, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అందుకే ప్రజలకు వాస్తవాలు వివరించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విషపు రాతలతో తనపై చేసిన ఆరోపణలు, రాసిన రాతలు అవాస్తవమని, తిరిగి ప్రజలకు వివరించాలని, లేనట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
తాను ఆస్తులు సంపాదించడం కోసం రాజ కీయాల్లోకి రాలేదని, ప్రజల ఆస్తులను కాపాడటానికి, వ్యవస్థలో మార్పు కోసం చట్టసభల్లోకి వచ్చానన్నారు. ఏంరాసిన చెల్లుతుందంటే కుదరదని ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోనన్నారు