calender_icon.png 25 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ప్రతిష్ఠ వేడుకలు

25-01-2026 12:20:05 AM

  1. సమ్మక్క సారక్కలకు ప్రత్యేక పూజలు         
  2. కనులపండువగా మహా శోభాయాత్ర
  3. సమ్మక్క సారక్క ప్రతిష్ఠకు మహా శోభయాత్ర

ఇల్లందు టౌన్, జనవరి 24,(విజయక్రాంతి): గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మ క్కసారక్క దేవతల ప్రతిష్ఠ వేడుకలు ఇల్లందు పట్టణంలో దండు సారయ్య ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇల్లందు చెరువు కట్ట ప్రాంతంలోని పెద్దమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా శోభాయాత్ర ప్రారంభమైంది. సమ్మక్కసారక్క దేవతల గద్దెలను సంప్రదాయ వేషధారణలతో యా త్రగా తీసుకువెళ్లగా, డప్పు నృత్యాలు, పోతరాజు వేషధారణలు, గిరిజన సంప్రదాయ కళారూపాలు యాత్రకు అదనపు శోభను చేకూర్చాయి.

పట్టణంలోని ప్రధాన రహదారి వెంబడి సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు బోనాలు, నైవేద్యాల తో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో పలువురు భక్తులు హారతులు ఇచ్చి దేవతలకు పూజలు నిర్వహిం చారు. శోభాయాత్ర చివరికి ఆర్ అండ్ ఆర్ కాలనీ వరకు చేరుకొని, దండు సారయ్య ఏర్పాటు చేసిన నూతన సమ్మక్కసారలమ్మ గుడి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ దేవతలకు ప్రత్యేక పూజ లు, హోమాలు, హారతు లు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.

పరిసర గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్ర మాలు సాగాయి. భక్తుల జయజయధ్వానాలు, నామస్మరణల మధ్య కార్యక్రమాలు శాంతియుతంగా ముగియడంతో ఇల్లందు పట్టణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందింది. ఈ జాతరలో ఇల్లం దు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి, ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, ప్రముఖ కళాకారిణి జాను లిరి, ప్రముఖులు పాల్గొని సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించారు.