మస్క్ కంపెనీకి పెట్టుబడుల వరద
28-05-2024 01:42 AM
న్యూఢిల్లీ, మే 27: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్‌ఏఐ సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌లో ఏకంగా ఆరు బిలియన్ల డాలర్లు సేకరించారు. ఇందులో వెంచర్ క్యాపిటలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్ సహా పలువురు బిజినెస్‌మ్యాన్స్ పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులను ఎక్స్‌ఏఐని మార్కెట్‌కు పరిచయం చేసేందుకు, అధునాతన మౌలికసదుపాయాలు నిర్మించేందుకు, భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధన, వాటి అభివృద్ధి మరింత పెంచేందుకు వినియోగించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 18 నుంచి 24 బిలియన్ల మేర నిధులు సేకరించినట్టు తెలుస్తోంది.






