30 June, 2026 | 5:24 AM

ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో

28-05-2024 01:47 AM

స్యూఢిల్లీ, మే 27: భారత టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో.. ఆఫ్రికాలో తమ కంపెనీని విస్తరించేందు కు సిద్దమవుతోంది. ఈ మేరకు ఘనాకు చెందిన నెక్ట్స్ జెన్ ఇన్‌ఫ్రాకోతో చేతులు కలిపేందుకు సన్నాహాలు చేస్తోంది. రిలయన్స్‌కు చెందిన ఎన్‌జీఐసీ ఒప్పందం కుదుర్చుకోనంది. ఘనాలో 5జీ అమలు కు కావాల్సిన మౌలిక వసతులను ఎన్‌జీఐసీ ఏర్పాటు చేయనుంది. అందుకు అవసరమయ్యే పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, అప్లికేషన్లను ర్యాడిసన్ సమకూర్చనున్నట్టు ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించినట్టు బ్లూమ్ బర్గ్ తెలిపింది. భారత్‌లో జియో అనుసరించిన వ్యూహాన్ని ఘానాలో అమలు చేయాలని ఎన్‌జీఐసీ భావిస్తున్నట్టు సమాచారం.

2016లో వచ్చిన జియో.. స్వల్ప కాలంలో భారత్‌లో అగ్రగామి టెలికాం ప్రొవైడర్‌గా అవతరించింది. తక్కువ ధర కే డాటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటి వ్యూహాలతో ప్రత్యర్థి సంస్థలకు చెక్ పెట్టింది. పోటీని తట్టుకోవడంలో వోడాఫోన్, ఐడియా వంటి సంస్థలు విఫలమయ్యాయి. 2024 చివరి నాటికి ఘనాలో సేవలు అందించేందుకు  ఎన్‌ఐసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతానికి ఎన్‌జీఐసీలో రిలయన్స్‌కు ఎలాంటి ఈక్విటీ వాటాలు లేవు. ఆఫ్రికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అసెండ్ డిజిటల్ సొల్యూషన్స్, కె కంపెనీ లు ప్రధాన ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వీటికి 55 శాతం వాటా ఉంది. ఘనా ప్రభుత్వానికి 10 శాతం వాటాలున్నాయి. భవిష్య త్తులో ఈక్విటీ వాటా తీసుకునే అవకాశం రిలయన్స్‌కు కల్పిస్తామని ఎన్‌జీ ఐసీ ప్రతినిధి పేర్కొన్నారు.