calender_icon.png 26 May, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలు తరలొద్దు

26-05-2025 01:16:56 AM

-ఉపాధి, ఆదాయం వచ్చే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి 

-ప్రతీ శనివారం ఇన్వెస్ట్‌మెంట్ 

-ప్రమోషన్ సమావేశం నిర్వహిస్తాం 

-హుందయ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు సబ్‌కమిటీ ఆమోదం

-ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ట్ర యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అ న్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు.

ఆదివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించారు. దీనిలో కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఇండస్ట్రి యల్ ప్రమోషన్, ఇప్పటికే చేసుకున్న ఎంవోయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఒక పరిశ్రమ స్థాపిస్తే అందుకు అనుబంధంగా పెద్దసంఖ్యలో పరిశ్రమ లు వచ్చే అవకాశం ఉన్న ప్రతిపాదనలపై దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని భట్టి అధికారులకు సూచించారు. ఇకనుంచి ప్రతీ శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహి ద్దామని భట్టి అధికారులకు తెలిపారు.

ఒక పరిశ్రమ ఏర్పాటుతో అనేక అనుబంధ పరిశ్రమలు రావడం తద్వారా రాష్ట్ర యువతకు వేలల్లో ఉద్యోగా లు, రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరే వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని సబ్ కమిటీ సూచిం చింది.

జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపనకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. 675ఎకరాల్లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయంగా సబ్‌కమిటీ అభిప్రాయపడింది.

ఈ రీసెర్చ్ సెంటర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు. రీసెర్చ్ సెంటర్ లో  ఆటోమోటివ్ టెస్ట్‌ట్రాక్, పైలట్ లైన్, ప్రోటోటైపింగ్ ప్రధాన వ్యవస్థలు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు సబ్ కమిటీకి వివరించారు.

ప్రస్తు తం ప్రారంభించబోతున్న పరిశ్రమలు రాబో యే కొద్ది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి, ఆదాయాన్ని రాష్ట్రానికి సమకూరుస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

సమావేశంలో ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్, సీఈవో సెక్రటరీ అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మల్సూర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.