23-05-2025 12:00:00 AM
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాచిత్రం ‘వార్2’. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్‌లో భాగంగా రూపొందిన ‘వార్’కు సీక్వెల్ ఇది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 21న రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని టీమ్ పేర్కొంది.
ఇదే విషయమై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు. “ఈ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రం ‘వార్2’లో నన్ను పూర్తి కొత్తగా చూపించారు. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. మేమంతా ఎంతో సరదాగా కలిసి పనిచేశాం. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమను చూసి నేను ఉప్పొంగిపోయాను.
ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలను చూస్తుంటే నేను నటుడిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక వరంలా అనిపిస్తుంది. ఈ ప్రేమ నాకు చాలా విలువైనది” అని పేర్కొన్నారు.