calender_icon.png 9 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజన్‌తో దూసుకెళ్తున్న సర్కార్

09-12-2025 12:43:53 AM

  1. అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు 
  2.   3 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా తెలంగాణ ఎదగాలి
  3. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, 2047 విజన్‌తో దూసుకెళ్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ -2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా రాష్ర్టం ముందుకు దూసుకెళ్తున్నదని.. అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నదని చెప్పారు. 2

047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. లక్ష్యా లు పెట్టుకోవడం, ముందుగానే ప్లాన్ చేసుకోవడం, క్రమశిక్షణతో అమలు చేయడం.. భవిష్యత్ మీద నమ్మకం ఉన్నప్పుడే ఇవి సాధ్యం అవుతాయన్నారు. భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఇప్పుడు మహిళలు, రైతులు, యువత, పిల్లలు అన్న వారందరినీ కేంద్రంగా పెట్టుకుని సమాన అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నదని తెలిపారు.

విద్యా రంగంలో మార్పులు తీసుకొ స్తూనే యువత కోసం స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకొస్తు న్నారని చెప్పారు. విమానాశ్రయాలు, పునరుత్పత్తిశక్తి, రవాణా వ్యవస్థలు, స్మార్ట్ జోనిం గ్ ఇలాంటి మౌలికవసతులు తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి దగ్గర చేస్తున్నాయన్నారు. స్పష్టమైన, స్థిరమైన పాలసీలు పెట్టుబడులను, అభివృద్ధిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. మహిళా కళాకా రిణులు, గిగ్‌వర్కర్లు కోసం కొత్త విధానాలు, విశ్రాంతి కేంద్రాలఏర్పాటు ఇందుకు నిదర్శనమన్నా రు. తెలంగాణ న్యాయం, అభివృద్ధి, ఐకమత్యం అనే విలువలతో సాగుతుందన్నారు.