calender_icon.png 15 January, 2026 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల ఆశాలపై నీళ్లు

15-01-2026 12:00:00 AM

నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం 

టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుద్యోగులను, విద్యార్థులను నమ్మించి మోసం చేయడంలో ప్రభుత్వం పీహెచ్‌డీ చేసిందని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు సమగ్రమైన ’జాబ్ క్యాలెండర్’ ప్రకటించకపోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి వంటి పెద్ద పండుగ సమయంలో రాష్ట్రమంతా సంబురాల్లో ఉం టే ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగుల కుటుంబాల్లో చీకట్లు అలముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిరుద్యోగుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం పండుగ చేసుకుంటోందా?‘ అని నిలదీశారు.

ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటూ ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమేనా అని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగు ల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయకుండా, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయిం బర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రభు త్వం అంధ కారంలోకి నెట్టేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే అన్నీ శాఖల్లోని ఖాళీలతో కూడిన వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా లని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన తన పోరాటం ఆగదని, ప్ర భుత్వం మొండి వైఖరి వీడకుంటే శాసన మండలి సాక్షిగా, ప్రజా క్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. 

ఉమ్మడి మెదక్‌లో టీఆర్పీలో చేరికలు

ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్పీ ఇన్‌చార్జి జ్యోతి పండాల్ సమక్షంలో బుధవారం లాల్సబ్ గడ్డ, సంగారెడ్డి జిల్లాలో  మైనార్టీలు ఆ పార్టీలో చేరారు. అలాగే మొహ మ్మద్ నవాజ్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామ స్థాయిలో తీన్మార్ మల్లన్న పోరాటం ప్రజలకు చేరుతుందని అన్నా రు. బీసీ ఉద్యమాన్ని ‘టీఆర్పీ చైతన్య బాట’ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, మైనారిటీ విభా గం జిల్లా అధ్యక్షుడు నవాజ్, మీడియా మిత్రులు యదాన్న తదితరులు పాల్గొన్నారు.