13-09-2025 02:50:59 PM
సి.ఎస్.ఆర్ పథకం కింద కంప్యూటర్లు బహుకరణ
హనుమకొండ (విజయక్రాంతి): కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద హనుమకొండలోని జోస్ అలుక్కాస్ బంగారు నగల దుకాణం వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆరు ప్రభుత్వ పాఠశాలలకు 12 లక్షల విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోస్ అలుక్కాస్, హనుమకొండ మేనేజర్ టీ .స్మితీష్, అసిస్టెంట్ మేనేజర్ గిరీష్, అకౌంట్స్ మేనేజర్ సుధీష్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూలై వాడ, ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ బాలికల పాఠశాల, లష్కర్ బజార్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రైల్వే గేట్, కిలా వరంగల్, ప్రభుత్వ ప్రాథమిక బాలుర పాఠశాల, కాజీపేట, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కాజీపేట జాగీర్, మండల ప్రజా పరిషత్ పాఠశాల, వేలేరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.