3 July, 2026 | 2:47 AM

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

03-07-2026 02:01 AM

సూర్యాపేట, జూలై 2 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కునుకుంట్ల సైదులు బొడ్డు శంకర్ పాల్గొని మాట్లాడుతూ పోరాటాలకు తల ఒగ్గి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో అమల్లోకి తెచ్చిందన్నారు.

దీనిద్వారా వలసలు తగ్గాయనీ గ్రామ యువతకు ఉపాధి దొరికిందన్నారు ప్రతి సంవత్సరం ఈ చట్టానికి నిధులు తగ్గిస్తూ ప్రస్తుతం చట్టాన్ని ఎత్తివేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రాంజీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్ గార్ అజివీక మిషన్ గ్రామీణ పేరుతో పథకం తీసుకొచ్చి 60 శాతం కేంద్ర నిధులు, 10 శాతం రాష్ట్ర నిధులు కొనసాగించాలని నిన్నటి నుండే అమలుకు పూనుకున్నదన్నారు. గతంలో 90 శాతం కేంద్రం 10 శాతం రాష్ట్రం ఇచ్చేది.

10 శాతం ఇవ్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడేది ఇప్పుడు 40 శాతం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ ఫలితంగా ఈ పథకాన్ని రద్దు చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా రైతులను కూలీలను ఐక్యం చేసి ప్రజా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య. పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మహేష్. పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి. పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్లూరు సింహాద్రి. భరత్. పి వై ఎల్ డివిజన్ అధ్యక్షులు దండి ప్రవీణ్. పి వై ఎల్ నాయకులు అశోక్ రెడ్డి. పాల్వాయి బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.