విద్యార్థుల ప్రతిభకు ఆర్థిక ప్రోత్సాహం
కోదాడ, జూలై 2 : కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల మాజీ, రిటైర్డ్ గెజిటెడ్ హెచ్‌ఎం ముత్తవరపు రామారావు సహకారంతో కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ గురువారం ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేశారు.
ఈ సందర్భంగా సలీం షరీఫ్ మాట్లాడుతూ 2026 ఎస్‌ఎస్సి పరీక్షలలో జిల్లా టాపర్స్ గా నిలిచి, త్రిబుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్ లకు 5000 రూపాయలు ఆర్థిక ప్రోత్సా హం అందించడం జరిగింది. రిటైర్డ్ హెచ్‌ఎం ముత్తవరపు రామారావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ ఉపాధ్యాయులు జాఫర్ శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మచారి బడుగుల సైదులు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.






