1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ

01-12-2025 12:00 AM

ఎల్బీనగర్, నవంబర్ 30 : నాగోల్ డివిజన్ బండ్లగూడలోని యెగ్గె మల్లేశం గార్డెన్లో ఆదివారం గురుస్వామి పల్లె మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో టేకుమట్ల మురళి గురుస్వామి నిర్వహణలో అయ్యప్పస్వామి 18వ మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళలు  పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామియే శరణం అయ్యప్ప  శరణం శరణం అయ్యప్ప మంత్రోచ్ఛారణలతో భక్తి వాతావరణం అలుముకున్నాయి. 

కార్యక్రమానికి పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణపతి పూజ, పుష్పాభిషేకం తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో స్థానికులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.