11 April, 2026 | 1:40 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా హాఫ్ మారథాన్

02-12-2024 02:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఐఐటీ హైదరాబాద్ రన్న ర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్ హాఫ్ మారథాన్  ఆదివారం నిర్వహించారు. ఈ హాఫ్ మారథాన్‌లో భాగంగా 21.1 కి.మీ, 10కె, 5కె రన్‌లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు పూర్ణా మాలవత్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాలవత్ పూర్ణ దృఢనిశ్చయంతో కూడిన తన ప్రయాణాన్ని వివరించారు. సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ కలిగి ఉండటం అవసరం అని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ మారథాన్‌తో విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం పెరుగు తుందన్నారు. రన్నర్స్ క్లబ్ అధ్యక్షులు ప్రొ. ప్రేమ్ పాల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేందర్ సుంకరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హిమాన్షు జోషి తదితరులు పాల్గొన్నారు.