11 April, 2026 | 11:53 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలి

02-12-2024 02:53 AM

రైతు కమిషన్  చైర్మన్ ఏ కోదండరెడ్డి 

ముషీరాబాద్, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించడం లేదని తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవ సభను నిర్వహించారు.

కార్యక్ర మానికి తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్, శాస్త్రవేత్త బాబురావు హాజరైయ్యారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ కనీస వేతన చట్టం రైతుకు అనుకూలంగా మార్చాలని, సహకార వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిం చాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ వెంకటరాజయ్య, ఎంపీజే అధ్యక్షుడు అజీజ్, గోవర్దన్, మల్లన్న పాల్గొన్నారు.