11 April, 2026 | 3:35 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

అట్టహాసంగా ఈశా రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు

02-12-2024 03:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో ఈశా గ్రామోత్సవం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఘనంగా ప్రారంభమ య్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ, హారిక నారాయణ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమరయ్య, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళల త్రోబాల్ పోటీల్లో సిరిసిల్ల జిల్లాకు చెందిన రాచెర్ల గొల్లపల్లి జట్టుకు మొదటి స్థానం, కొత్తపల్లి వారియర్స్ రెండో స్థానంలో నిలిచారు. పురుషు ల వాలీబాల్ పోటీలలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నారపల్లి జట్టు మొదటి స్థానంలో నిలవగా.. సంగారెడ్డి జిల్లాకు చెందిన కాసల, వరంగల్ జిల్లాకు చెందిన నీరుకుల్ల, జనగాం జిల్లాకు చెందిన గూడూరు జట్టులు తదుపరి స్థానాల్లో నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతు లను అందజేశారు.

ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 174 వాలీబాల్, 60 త్రోబా ల్ టీంలు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. ఫైనల్ పోటీలు కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్, స్టేట్ వాలీబాల్ రెఫరీ బోర్డ్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.