2 July, 2026 | 3:56 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

30-11-2025 10:32 PM

ఎల్బీనగర్: నాగోల్ డివిజన్ బండ్లగూడలోని యెగ్గె మల్లేశం గార్డెన్‌లో ఆదివారం గురుస్వామి పల్లె మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో టేకుమట్ల మురళి గురుస్వామి నిర్వహణలో అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. “స్వామియే శరణం అయ్యప్ప - శరణం శరణం అయ్యప్ప” మంత్రోచ్ఛారణలతో భక్తి వాతావరణం అలుముకున్నాయి.  కార్యక్రమానికి పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణపతి పూజ, పుష్పాభిషేకం తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో స్థానికులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.