02-07-2025 05:53:25 PM
వరంగల్/మహబూబాబాద్ (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానం(Sri Bhadrakali Temple)లో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ‘ఉగ్రా మాత’ గాను, షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని ‘శివదూతీమాత’ గాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. ఆలయంలో ఏర్పాట్లను ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, అనంతుల శ్రీనివాస్, ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.