15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రియేటివ్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

02-02-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 1: క్రియేటివ్ టీ చర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నూ తన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా లింగ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ముక్క రమేష్, ఆర్థిక కార్యదర్శిగా తాళ్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డి, శివకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లింగ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల అధికారులుగా ముండ్రాతి రమేష్, కల్లేపల్లి శ్రీనివాస్ వ్యవహరించారు. సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు జైన సత్యం, మాజీ అధ్యక్షుడు రచ్చ జగన్ పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 38 మంది సంఘ సభ్యులను ఘనంగా సన్మానించారు.