08-11-2025 10:01:56 PM
డా. సొలోమన్ రెడ్డికి డాక్టరేట్..
మలేషియా మాస్ట్రో యూనివర్సిటీ గౌరవం.. సెయింట్ ఆంథోనీస్ పాఠశాల తరఫున ఘన సన్మానం..
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థలో శనివారం గౌరవ డాక్టరేట్ సత్కార సభ ఘనంగా జరిగింది. సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల అధినేత డా. ఈ. సొలోమన్ రెడ్డి విద్యారంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి మలేషియా మాస్ట్రో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. కార్యక్రమాన్ని డా. సొలోమన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ. అరుణ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఈ. జయబాల రెడ్డి, డైరెక్టర్ ఈ. విజయ కుమార్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఈ. జ్యోతి రెడ్డి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జోహార్, వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్ లక్కిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
తరువాత విద్యార్థులు స్వాగత నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమాన్ని అలరించారు. 26 సంవత్సరాలుగా విద్యా అభివృద్ధికి కృషి చేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దినందుకు గాను డాక్టర్ సొలోమన్ రెడ్డిని మాస్ట్రో యూనివర్సిటీ గౌరవించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, సేవాభావం గల సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఘనంగా సన్మానించారు. పాఠశాల తరఫున ఆయనకు శాలువా, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.