08-11-2025 09:57:04 PM
కోదాడ పట్టణ సీఐ శివశంకర్..
కోదాడ: మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపితే బాధ్యులపై చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో వివిధ ప్రధాన కూడలి వద్ద మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తులు వారి తల్లిదండ్రులు అందరికీ పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కలిగించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లైసెన్స్, సి-బుక్, ఇన్సూరెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పోలీస్ సిబ్బంది, వాహన చోదకులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.