21-12-2025 12:04:42 AM
ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
నిజామాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): నిజామాబాద్ మండల కేంద్రంలోని ముత్తకుంట గ్రామానికి చెందిన ధర్మారం బాలా గౌడ్ బైక్‌పై మోస్రకు వెళుతుండగా ఎల్లమ్మ ఆలయం సమీప రోడ్డుపై హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వర్ని పోలీస్టేషన్ పరిధి మోస్ర గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. నిజామాబాద్ మండల కేంద్రంలోని ముత్తకుంటకు చెందిన ధర్మారం బాలా గౌడ్ వృతి రీత్యా గీతా కార్మికుడు.
పని నిమిత్తంబైక్‌పై మోస్రకు వెళుతుండగా ఎల్లమ్మ ఆలయం సమీపంలో మోస్రకు వెళ్లే రహదారి పై హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపోయి ద్విచక్ర వాహనదారుని గొంతు మెడ చుట్టుకుని గాయాలయ్యాయి. స్థానికులు లైన్‌మన్ కు సమాచారం అందించాగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాయాలైన బాలయ్యను ప్రభుత్వా స్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలయ్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాలయ్య భార్య రేణుక వర్ని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.