calender_icon.png 21 December, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురుగు మళ్లింపుతో దోమలకు చెక్

21-12-2025 12:04:19 AM

  1. బాక్స్ డ్రైన్ ద్వారా నీటి మళ్లింపు
  2. మూసీ ప్రక్షాళన జాబితాలో ఇబ్రహీంబాగ్ చెరువు
  3. యుద్ధప్రాతిపదికన ఫాగింగ్ చర్యలు

మణికొండ, డిసెంబర్20 (విజయక్రాంతి) : మణికొండ పరిధిలోని ఇబ్రహీం బాగ్ చెరువులో దోమల బెడద నివారణకు అధికారులు, స్థానిక నాయకులు ముమ్మర చర్యలు చేపట్టారు. శనివారం మాజీ చైర్మన్ నరేందర్, జితేందర్ మెరుగు, డిప్యూటీ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారుల బృందం చెరువును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చెరువును ఎండబెట్టేందుకు ప్రయత్ని స్తున్నప్పటికీ, వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆటంకం కలుగుతోందని అధికారులు గుర్తించారు.

దీంతో తక్షణ పరిష్కారంగా మురుగు నీటిని బాక్స్ డ్రైన్ ద్వారా మళ్లించి, చెరువులోకి నీరు చేరకుండా అడ్డుకట్ట వేశారు. ఈ చర్య ద్వారా దోమల ఉధృతి తగ్గడంతో పాటు చెరువు త్వరగా ఎండేందుకు ఆస్కారం ఉంటుందని వారు తెలిపారు.మరోవైపు చెరువులో గుర్రపు డెక్క ఎండిపోయేలా రసాయనాలు పిచికారీ చేయడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

మరమ్మ తులో ఉన్న ఫాగింగ్ యంత్రాలను బాగుచేయించి, వెంటనే ఫాగింగ్ ప్రక్రియను పునరు ద్ధరించాలని నిర్ణయించారు. అలాగే డ్రోన్ల ద్వారా నిరంతరాయంగా రసాయనాలు పిచికారీ చేయాలని జీహెచ్‌ఎంసీ ఈఈని కోరారు. ప్రతిష్టాత్మక మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్న 14 చెరువుల జాబితాలో ఇబ్రహీంబాగ్ చెరువుకు చోటు దక్కడం హర్షణీయమని జితేం దర్ మెరుగు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, తాజ్ భాయ్, సీనియర్ నాయకులు ముత్యాల, మణికొండ మాజీ సర్పంచ్ యాలాల నరేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.