21-12-2025 12:08:26 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లలో వేగం పెంచింది. గడువులోగా ఫీజులు చెల్లించని వ్యాపారుల నుంచి నేటి నుంచి జరిమానాలతో కూడిన వసూళ్లను ప్రారంభించింది. ఈ ఏడాదికి బల్దియా నిర్దేశించుకున్న లక్ష్యానికి, ప్రస్తుత వసూళ్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్స్ ఫీజుల ద్వారా రూ. 120 కోట్లు వసూలు చేయాలని జీహెఎంసీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ఇప్పటి వరకు కేవలం 35,000 వ్యాపార సంస్థల నుంచి రూ. 50 కోట్లు మాత్రమే ఖజానాకు చేరాయి. లక్ష్యా న్ని చేరుకోవాలంటే ఇంకా రూ. 70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గతేడాది ఇదే సమయానికి 1.13 లక్షల ట్రేడ్స్ నుంచి బల్ది యా రూ. 112 కోట్లు రాబట్టగలిగింది.
గతేడాదితో పోలిస్తే ఈసారి వసూళ్లు మందకొడిగా సాగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలతో కూడిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపునకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఈ లోగా స్పం దించని వ్యాపారులకు, ఫీజులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, ఫీజులు వసూ లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యటించి వసూళ్లు చేపట్ట నున్నారు.
మరోవైపు, జీహెఎంసీ పరిపాలనా పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది నుంచి ట్రేడ్ లైసెన్స్ టార్గెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా అనేక వాణి జ్య ప్రాంతాలు, పరిశ్రమలు బల్దియా పరిధిలోకి రానుండటంతో ఆదాయం గణనీయం గా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ నెలాఖరులోగా పెండింగ్ బకాయిలను వసూలు చేయడంపైనే బల్దియా ఫోకస్ పెట్టింది.