calender_icon.png 13 December, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను హత్య చేసి.. వీడియో రిలీజ్ చేసి భర్త ఆత్మహత్య

13-12-2025 06:38:05 PM

వేధింపులు తాళలేకనే హత్య చేసినట్లు వెల్లడి..

భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో దారుణం..

రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): భార్య, కూతురు వేధింపులు భరించలేక భార్యను తాడుతో ఉరి వేసి హత్య చేశాడు. అనంతరం స్థానిక ఎస్సైకి తన వేదన వివరిస్తూ వీడియో విడుదల చేసి, వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(50) మొదటి భార్య చనిపోగా సంధ్య(42) రెండో వివాహం చేసుకొని సీతారాంపురం గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో వీరికి కూతురు కాగా, కూతురుకు పెళ్లి అయి అత్తారింటికి వెళ్లిపోయింది. బాలాజీ రామాచారి అనారోగ్యంతో బాధపడుతూ భార్య సంధ్యతో రోజు మనస్పర్ధలు ఉండేవి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో భార్య సంధ్యను తాడుతో ఉరివేసి చంపి గణపురం ఎస్సైకి తను పడుతున్న బాధను వివరిస్తూ వీడియో తీసి వాట్సప్ స్టేటస్ పెట్టుకొని ఆపై తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.