13-12-2025 06:41:08 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
టేకులపల్లి, (విజయక్రాంతి): అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది.. పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత నాది.. అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలంలో శనివారం పంచాయతీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా టేకులపల్లి బోడు క్రాస్ రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సమావేశంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సురక్షంగా ఉన్నారు. ఇందిరమ్మ ప్రభ్యత్వం ఏర్పడ్డ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామాల్లో సీసీ రోడ్లు, వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంతన్న ప్రభుత్వంలో మనం నెరవేర్చుకున్నామన్నారు.
కొందరు కలలు కంటున్నారని, కొద్దీ రోజుల్లోనే తానే ఎమ్మెల్యేగా వస్తున్నానని చెబుతున్నారని అలంటి కలలు నెరవేరవని, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని, ఇక్కడ అభివృద్ధి పనులు చేసేది నేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంది, ఇక్కడ నేనున్నా ఏ పనులు చేయాలన్న చేసే బాధ్యత నాదన్నారు. టేకులపల్లి మండలంలో ఎంత అభివృద్ధి చేసింది ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలన్నారు. మండలంలోని శంబునిగూడెం, చంద్రుతండా, కొత్తతండా (జి), గొల్లపల్లి, చింతలంక, సులానగర్, ముత్యాలంపాడు X రోడ్డు, టేకులపల్లి, గోల్యాతండా, బేతంపూడి, తొమ్మిదోమైలుతండా, తావుర్యతండా, కొత్తతండా (పి), రాంపురం, ప్రేగళ్లపాడు పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు కోరం సురేందర్, పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.