calender_icon.png 3 May, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేల కూలిన వందల ఏళ్ల వట వృక్షం

03-05-2025 01:29:38 AM

మహబూబాబాద్, మే 2 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి వీచిన పెను గాలులకు బయ్యారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ మర్రిగా గుర్తింపు పొందిన 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు కూకటి వేళ్ళతో నేల కూలింది.

దేవాలయం పక్కనే ఉన్న మరి చెట్టు అనేక సంవత్సరాలుగా ప్రజలకు నీడనివ్వడంతో పాటు పిల్లలు ఆడుకోవడాని అణువుగా ఉండేది. ప్రజలతో ఎంతో విడదీయరాని అనుబంధం ఉన్న మర్రి వృక్షం సమూలంగా పడిపోవడంతో బయ్యారం ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.