calender_icon.png 29 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలో మూడు రోజులు ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’

03-05-2025 01:29:27 AM

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇల్లంతకుంట, మే2(విజయక్రాంతి): ప్రతి వారంలో మూడు రోజులు ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువగా ఉంటానని  మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా  గ్రామంలో నెలకొన్న క్షేత్ర స్థాయి సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా,వాటిని తక్షణమే శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిష్కరించారు. అనంతరం మానకొండూరు  రీచ్ ది అన్ రీచ్డ్ అనే థీమ్‌తో ఎమ్మెల్యే అన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను తయారు చేయించి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచామని,  ఈ యాప్ను నియోజకవర్గంలోని 2.28 లక్షల మంది ఓటర్ల ఐడీకి అనుసంధానం చేయించామని వెల్లడించారు. 

గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు వెంటనే నిధులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంజూరు చేశారు. కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఫారుక్, ఎంపీడీఓ శశికళ, సీఐ మొగిలి, ఎస్త్స్ర శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్, తదితర రెవెన్యూ, పంచాయితీరాజ్, సెస్ అధికారులు పాల్గొన్నారు.