calender_icon.png 3 May, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దారులకు కొత్తరూపు

03-05-2025 01:29:58 AM

  1. 17వేల కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు 
  2. హామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు దశల్లో పనులు
  3. మొదటి విడతలో 7,393 కిలోమీటర్లు

9 ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే 4 వేల కిలోమీటర్ల సర్వే పూర్తి

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): పల్లె రహదారులకు మహర్దశ పట్ట నుంది. గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఆధునీ కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యూటీ మోడ్ (హెచ్‌ఏఎం) విధానా నికి శ్రీకారం చుట్టింది. జాతీయ, ఆర్ అండ్ బీ రోడ్లు వేసినట్టుగానే, గ్రామీణ రహదారులను తీర్చిదిద్దేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు కలుపుతూ జిల్లా కేంద్రాలకు అనుసంధానించే రహదారు లను హామ్ విధానంలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది.

హామ్ ప్రాజె క్టులో భాగంగా 17,300 కిలోమీటర్ల పొడవున పంచాయతీరాజ్ రోడ్లు, 12,000 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లను వేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో 7,393 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మించనున్నారు. కాగా, ఉమ్మడి 9 జిల్లాల్లో ఇప్పటికే 4వేల కిలోమీటర్ల మేర సర్వే పూర్తి చేసింది. ప్రతిపాదిత రోడ్లకు ఆయా నియోజకవ ర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదం పొందిన తర్వాత రహదారుల ప్రతిపాదనలను పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు ఖరారు చేయనున్నారు.

క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత హామ్ ప్రాజెక్టు విధివిధానాల ఖరారు కానున్నాయి. సమయం వృథా కాకుండా సమాంతరంగా సర్వే కొనసా గుతుండగా.. హామ్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే కన్సల్టెంట్లను నియ మించింది. కన్సల్టెంట్లు ప్రాజెక్ట్ డీపీఆర్ లను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత పీఆర్ శాఖ టెండర్ ప్రక్రియను మొదలు పెట్టనుంది.

హామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించి కొంత షేర్‌ను ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన షేర్‌ను టెండర్ దక్కించుకునే కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. 15 ఏళ్ల పాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యత లను చేపట్టాల్సి ఉంటుంది. కాగా, రహదారుల నిర్మాణ పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గడువులోగా పనులు చేపట్టాలి.. 

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో హామ్ విధా నం అమలవుతోంది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా త్వరితగతిన గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి చే యొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న గడువులోగా పనులు చేపట్టి, పూర్తి చేయాలని మంత్రి సీత క్క ఆదేశాలు జారీ చేశారు. హామ్ పనుల పర్యవేక్షణ కోసం పీఆర్ ఇంజినీరింగ్ హెడ్ ఆఫీస్‌లో ప్రత్యేక అధికారిని నియమించారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సైతం సిద్ధమవుతున్నాయి. కన్సల్టెం ట్ కంపెనీలు ఇచ్చే డీపీఆర్‌కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించి, క్యాబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటారు. తెలంగాణ ప్రభు త్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద గ్రామ పంచాయతీ నుంచి మండల ప్రధాన కార్యాలయం, మండల ప్రధాన కార్యాలయం నుం చి జిల్లా ప్రధాన కార్యాలయం, జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకు అనుసంధాన రహదారుల నిర్మించనున్నారు. 

మూడు దశల్లో పనులు

ఈ ప్రాజెక్ట్‌ను 3 దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిదశ పనులను 2026, జనవరిలో, రెండోదశ పను లను 2026, మార్చిలో, మూడో దశ పనులను 2026, జూన్‌లో ప్రారంభించను న్నారు. కన్సల్టెంట్లు, అధికారులు అంచనాలను తయారు చేసి టెండర్లు, అగ్రిమెంట్లు వివిధ పనులను త్వరితగతిగా చేపట్టాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు.