1 September, 2026 | 12:33 AM

ప్రకాశం బజార్లో తప్పిన పెను ప్రమాదం..!

22-09-2025 09:18 PM

ఉలిక్కిపడ్డ వ్యాపారులు, స్థానికులు

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ ఓల్డ్  కలెక్టరేట్ రోడ్డులో సోమవారం పెను ప్రమాదం తప్పింది. వాతావరణం మార్పుతో బలమైన ఈదురు గాలులు వీస్తూ ఓల్డ్ కలెక్టరేట్ ప్రకాశం బజార్లో విద్యుత్ సర్వీసు వైర్  ఒక్కసారిగా తెగిపడింది. ఆ సమయంలో  ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు పేలినట్టు శబ్దాలు రావటంతో వ్యాపారస్తులువ్యాపారస్తులు స్థానికులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు  కరెంటును తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తెగిపడిన సర్వీస్ వైర్లు తొలగించి కరెంటుకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.