calender_icon.png 22 September, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

22-09-2025 09:14:57 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరు గుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలి చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.