31-12-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : గుట్టు చప్పుడు కాకుండా జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసు కొని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్పగించారు. సులేమాన్ నగర్ లో నివాసం ఉండే మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ చికెన్ దుకాణాన్ని నడిపేవాడు. చికెన్ దుకాణం వల్ల సరిపడినంత సంపాదన లేదని, ఎక్కువ డబ్బు సం పాదించాలనే దురాచన కలిగింది.
అయితే వనపర్తి ప్రాంతంలోని కొందరి పరిచయం తో గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా వన్య ప్రాణి అయిన జింక మాం సం అక్కడి నుంచి తీసుకొచ్చి కిలో 800 నుంచి 1000 రూపాయల వరకు విక్రస్తూ సొమ్ము చేసుకొంటున్నాడు.
వన్య ప్రనులను హింసించడం చట్ట వ్యతిరేకం. జింక మాం సం విక్రస్తున్నాడన్న సమాచారంతో మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగిం చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. నిందితుని వద్ద నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, రెండు కత్తులు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు.