calender_icon.png 31 December, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైన నిహాన పటేల్

31-12-2025 12:00:00 AM

కేసముద్రం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మం డల కేంద్రానికి చెంది న బెల్లం నిహనా పటే ల్ జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైంది. జనవరి 16 నుండి 19 వరకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జరిగే జాతీయస్థాయి జిమ్నాస్టిక్ అండర్ 11 ఇయర్స్ విభాగంలో నిహానా పటేల్ పాల్గొననుంది. నిహాన పటేల్ ప్రస్తుతం హనుమ కొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో క్రీడా హాస్టల్లో కోచ్ నరేందర్, దేవిక వద్ద శిక్షణ పొందుతోంది.