31-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, క్రిమిసంహారక మందులకు బదులు సేంద్రియ పద్ధతి అవలంబించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంఘాల చైర్మన్ గా పనిచేస్తూ సేంద్రియ విధానానికి ఊతమిస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు సొల్లేటి జైపాల్ రెడ్డికి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉత్తమ పురస్కారాన్ని ప్ర ధానం చేసింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జైపాల్ రెడ్డి అవార్డు అందుకున్నారు. వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, ఆగ్రో ఎక్కువ టూరిజం కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు చెప్పారు.