12 June, 2026 | 5:34 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

ప్రేమకథను ఆవిష్కరించే మెలోడీ

28-09-2024 12:53 AM

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శ్వాగ్’. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్ మరో కథానాయిక. దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ పలు పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

శుక్రవారం రిలీజ్ అయిన ‘నీలో నాలో’ పాట ఆకట్టుకుంటోంది. వివేక్ సాగర్ స్వరపర్చగా, భువనచంద్ర సాహిత్యం అందించారు. రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. పాటలో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ మెలోడీ ట్రాక్ వారి ప్రేమకథను అందంగా ఆవిష్కరిస్తోంది.