12 June, 2026 | 4:21 PM

Breaking News

విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి   •   డ్రగ్స్ వద్దు- జీవితం ముద్దు   •   రేవంత్ సర్కార్ రైతు డిస్కమ్ పెట్టిందే ప్రైవేటీకరణ కోసం   •   విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి   •   రిమ్మా గ్రామాన్ని సందర్శించనున్న రెండవ మంత్రి   •   పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోంది   •   దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్   •   టీయూవీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జోగు అశోక్ కుమార్ నియామకం   •   శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు   •   ఉప్పల్‌ భాగయత్ లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం   •  

జపాన్ తప్పకుండా వస్తా!

28-09-2024 12:54 AM

జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా రావడంతో అటు అభిమానులు, ఇటు సినీప్రియులు దేవర సినిమా మేనియాలో మునిగిపోయారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌వల్‌లో ప్రదర్శించారు. ఈ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు.

అనంతరం తనని కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులతో ముచ్చటించారు. అయితే ఈ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఒక మహిళ అభిమాని జపాన్‌లోని టోక్యో నుంచి జర్నీ చేసి లాస్ ఏంజెలిస్‌కు చేరుకుంది. బియాండ్ ఫెస్ట్‌వల్‌లో ఎన్టీఆర్‌ను కలుసుకుని మాట్లా డింది. అయితే తారక్‌ను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.

తారక్‌తో మాట్లాడుతూ.. ‘మిమల్ని చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారు. మా దేశానికి రండి’ అని ఆహ్వానించింది. ఆమె మాటలకు ఆనందం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ‘మీ దేశానికి తప్పకుండా వస్తా!’ అంటూ మాటిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా ‘దేవర’కు వస్తున్న స్పందనపై హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మీ రెస్పాన్స్‌ని చూస్తుంటే సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. అభిమానులకు రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.