calender_icon.png 15 November, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు పటిష్టతకు సహకరించాలి

15-11-2025 12:14:14 AM

-డిపాజిట్లు విరివిగా తీసుకురావాలి

-నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు రమేశ్

-బ్యాంకు 2,500కోట్ల మైలురాయి చేరుకున్నందుకు సిబ్బంది సంబురాలు

నిజామాబాద్, నవంబర్ 14(విజయక్రాం తి):బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు 2,500 కోట్ల మైలురాయి చేరుకున్నందుకు గాను శుక్రవారం నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకులో సిబ్బంది సంబరాలు జరు పుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధ్యక్షుడు కుంట రమేశ్ తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ బ్యాంకు 2,500 కోట్ల మైలురాయి చేరుకోవడంలో సహకరించిన ప్రతి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే ప్రయత్నం మున్ముందు కూడా కొనసాగించి ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 3000 కోట్లు చేరుకోవాలని సూచించారు. అనంతరం అధికారుల సమీక్షా సమావేశం లో మాట్లాడుతూ రాబోవు రికవరీ సీజన్‌లో అన్ని విధాలుగా ప్రయత్నించి ఇది వరకు ఉన్న ఎన్‌పీఏను ఇంకా తగ్గించాలని తెలిపారు. ఇటీవల ప్రవేశ పెట్టిన కామధేను డిపాజిట్‌ను విరివిగా ప్రచారం చేసి డిపాజిట్లు తీసుకురావాలని, బ్యాంకులో ఉన్న అన్ని స్థాయి లో గల ఉద్యోగులు తనకు తానుగా లక్ష్యాన్ని నిర్దేశించు కుని చేరుకోవాలని సూచించారు. 

2500 కోట్ల మైలురాయి చేరుకోవడం లో ప్రత్యేక భూమిక వహించి, నిరంతరం సమీక్ష చేస్తూ క్షేత్ర స్థాయిలో విలువైన సూచనలు సూచిస్తూ, బ్యాంకు పటిష్టతకి తీసుకుం టున్న చర్యలకుగాను ముఖ్యకార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారులకు ప్రత్యేక శుభాకాం క్షలు తెలిపారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆనంద్, లింగ య్య, ముఖ్య కార్యనిర్వహణాధికారి  నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల అధికారులు పాల్గొన్నారు.