ఇంధన రంగంలో కొత్త మైలురాయి
-తమిళనాడులో 250 మెగావాట్ల ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న ఎంఈఐఎల్
-అబుదాబి సంస్థ నుంచి వంద శాతం వాటా కొనుగోలు
-లిగ్నైట్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయనున్న టీఏక్యూఏ నేవేలి
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తమిళనాడులోని నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగో లు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సం స్థ నుంచి వందశాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎంఈఐఎల్ ప్రకటించింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) తమిళనాడులోని నేవేలిలో ఉన్న టిఏక్యూఏ నేవె లీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టిఏక్యూ ఏ నేవెలీ) సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్సి (టిఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది.
ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్ఫ్రా డెవలపర్‌గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ చేసిన ఈ కొనుగోలు నిలుస్తోంది. టిఏక్యూఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సర ఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొ ల్పింది.
ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళ నాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రం గం లో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందు కు తీసుకెళ్తోంది. టిఏక్యూఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎంఈఐ ఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది.
కొనుగోలు వ్యూహాత్మక మార్పు
ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయి గా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహా త్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృ ష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతిచ్చే వ్యూహాత్మక పెట్టుబ డులపై కొనసాగుతుంది. థర్మల్, హై డ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయంచేసే సమతులిత, స్థిరమైన వి ద్యుత్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో నిర్మాణాని కి మేం కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.






