calender_icon.png 1 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్యతతోనే ఐక్యత

01-11-2025 12:00:00 AM

  1. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ 
  2. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏక్తా దివస్
  3. ఉత్సాహంగా ’రన్ ఫర్ యూనిటీ’ 
  4. వనస్థలిపురం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 
  5. రక్తదాన శిబిరాలు, రక్తదానం చేసిన పోలీసులు 

ఎల్బీనగర్, అక్టోబర్ 31 : సమైక్యతతోనే ఐక్యత ఉంటుందని, ప్రతిఒక్కరూ పరస్పర సహకారంంతో సమష్టిగా దేశాభివృద్ధికి కృషి చేయాలని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. ఇందులో భాగంగా వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్ నగర్ పోలీసులు ’రన్ ఫర్ యూనిటీ’లో భాగంగా 3కే రన్, 2కే రన్ మారథాన్ నిర్వహించారు.

మారథాన్ లో విద్యార్థులు, యువకులు, కాలనీ వాసులు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వనస్థలిపురం పోలీసులు నిర్వహించిన 2కే రన్ లో 200 మంది పాల్గొన్నారు.  ఆయా కార్యక్రమాల్లో ఏసీపీలు కృష్ణయ్య, కాశిరెడ్డి, ఇన్ స్పెక్టర్లు మహేష్, రాజేశ్, సైదిరెడ్డి, సైదులు, వినోద్ కుమార్, నాగరాజు గౌడ్, మక్బూల్ జానీ, అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్, ఎస్వోటీ ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. 

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి 

రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా మారాలని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ అన్నారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎల్బీనగర్ డివిజన్లోని చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్, నాగోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో చైతన్యపురిలో మిత్ర బ్లడ్ డొనేషన్ సెంటర్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. ఆమె ప్రారంభించి మాట్లాడారు.

ఈ శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లు కలిసి మిత్ర బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో  చింతల కుంటలోని ప్రలవి గార్డెన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 60 మంది, పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీలు, సీఐలు సైదిరెడ్డి, కె.వినోద్ కుమార్, మక్బూల్ జానీ, మహేశ్, రాజేశ్, అశోక్ రెడ్డి, నాగరాజు, శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.