calender_icon.png 1 November, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మకు అక్షరమాలపై వీవోఏలకు శిక్షణ

31-10-2025 11:36:43 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం పై గ్రామ సంఘం అధ్యక్షులకు, కార్యదర్శులకు, వివో ఏలకు సిఆర్పిలు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చదువు యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. చదువు మహిళల ఆర్థిక ,రాజకీయ ,సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిపిఎం సుధాకర్, జిల్లా డీపీఎం స్వర్ణలత, ఏపిఎం విజయలక్ష్మి, సీసీలు, స్టేట్ సీఆర్పీలు రజిత, స్వప్న లతోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఆర్పీలు, సభ్యులు, వివో ఏలు పాల్గొన్నారు.